*స్నే "హితులు" లేని శూన్యత.!*
*స్నేహితుడు అంటే ఓ భరోసా!*
ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి… మన మంచి స్నేహితులను గుర్తు చేసుకుందాం...
*ఒక్కొక్కరు వెళ్లినప్పుడు ఒక్కొక్క గాయం.*
ఆ గాయాలన్నీ కలిసి అప్పుడప్పుడు
*ఒక పెద్ద శూన్యతగా మారడం* అనేది 70 లేదా 75 సం వయసులో సహజం!
పిల్లలు బాగున్నారు…
కానీ, వారి వ్యాపకాల్లో వారుంటారు.
*గౌరవానికి కొదువ లేదు.*
కానీ, *ఓ స్నేహితుడితో ఉండే ప్రైవసీ,* ఆ సరదా క్షణాలు కూడా కావాలి కదా!
నిద్ర పట్టడం లేదు,
బోర్ కొడుతున్నది.
*ఎవరితో మాట్లాడాలి?*
నా స్నేహితులెక్కడ?
*వాళ్ళు పోయారే.*
ఇక అంతేనా...?
ఉదయం లేచి
కాఫీ తాగేటప్పుడు
“ఏరా, బాగున్నావా?”
*అని అడిగే స్నేహితుడెక్కడ?*
ఓ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా,
కొనాలనుకున్నా...
*నమ్మకమైన సలహా ఎవరు ఇస్తారు.?!*
ఒక స్నేహితుడు,
ఓ సందర్భంలో అన్నాడు_,
“నా భార్య పోయిన తర్వాత మొదటిసారిగ నీ ముందే ఏడ్చాను. నువ్వు నన్ను ఓదార్చలేక… *నువ్వూ నాతో పాటు ఏడ్చావు... అని!*
ఆ రోజే నాకు తెలిసింది –
*స్నేహం అంటే ఒంటరితనాన్ని జయించడమని.!*
మరొక స్నేహితుడు ఇలా అన్నాడు.!_ నా సమస్యను చెప్పకుండా దాచాను. కానీ, నువ్వు రావటం చూసి… నీతో చెప్పుకుంటే… భయం కాస్త తగ్గుతుందనిపించింది.
చావంటే భయం కాదు…
*ఒంటరిగా చావడం* అంటే
*భయంగా ఉంది_* అన్నాడు!
ఓ మంచి డాక్టర్ అవసరం పడ్డప్పుడు, అత్యంత *నమ్మకంగా ఎవరు చెబుతారు?*
డాక్టర్ దగ్గరకు వెళ్తున్నానంటే...
*“నేను కూడా వస్తా”*
అనే మిత్రుడుండాలి.
*ఒంటరితనం అనిపిస్తే!*
“రా… మా ఇంటికి రా… ఇద్దరం కూర్చుని మాట్లాడదాం”
లేకపోతే... *రమ్మంటావా"_*
అనే మిత్రుడుండాలి.
*ఏరా! ఎలా ఉన్నావు.*?
*ఎందుకో గుర్తు వచ్చావు_* నీతో మాట్లాడాలనిపిస్తోంది.
--అనే మిత్రుడుండాలి.
ఒక స్నేహితుడు రాత్రి 11:30కి మెసేజ్ చేస్తాడు, “నిద్ర పట్టడం లేదు రా… ఒంటరిగా అనిపిస్తోంది.” “నేనూ అలాగే ఉన్నా. కలుసుకుందామా? కలుసుకుని మనసుతీరా, ఓ రెండు గంటలు మాటలు...*నేనున్నారా. భయపడకు”_* ఆ భరోసాలో ఎంత థైర్యం? *ఆ మాట అనగలిగేవాడు ఒక్కడైనా ఉంటే చాలు.*
*అలాంటి బంధమే*
మన వృద్ధాప్యంలో అతి పెద్ద ఆసరా అవుతుంది. *ఇటువంటి అనుభూతులే.* మన చివరి రోజుల్లో మనకు అతి పెద్ద ఆసరా అవుతాయి!
స్నేహితులను కలుసుకుంటూనే ఉంటాం... కానీ, తొక్కలో *ఇగో'*
మాటల్లో *ఎక్కడో తేడా కొట్టుద్ది.*
*క్షణాల్లో సంవత్సరాల పరిచయానికి తెర పడుతుంది.*
కొందరితో ఎలాగూ కలవదు మనకు. దానివల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు.
కాని, చిన్ని-చిన్ని కారణాలతో మంచి స్నేహితులను వదులుకుంటే
*చివరికి ఎవరూ మిగలరు.*
ఒక్క ముక్క మాటాడితే *కొండంత ధైర్యం* ఇచ్చేవాడు నిజమైన స్నేహితుడు.! అలాటి స్నేహితుడు
*ఒక్కడున్నా చాలు.!*
"నీకు అతనే కొండంత భరోసా.!" *అలాంటి వారి కోసం వెతకండి, వెతుకుతూనే ఉండండి.....* 🙏🏼🙏🏼
Comments
Post a Comment